పత్రం- పత్రాల ఔషధము Leaves and medicinal use
- Dr.Vandana Seshagirirao
- Jan 21, 2016
- 2 min read

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. మాచీ పత్రం -నేత్రములకు మంచి ఔషధము. ఆకుని తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి. పసుపూ నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి. నేలమునుగ ఆకులు - ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును. శరీరమునకు దివ్యఔషధము. మారేడు ఆకులు - మూల శంక నయమగును. రోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి. జంటగరిక ఆకు - మూత్ర సంబంధ వ్యాధులు తొలుగును. పచ్చడి చేసుకొని తినవలెను. ఉమ్మెత్త ఆకు - మానసిక రోగాలు తొలగును. ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేయాలి. రేగు ఆకు - శరీర సౌష్టవానికి శ్రేష్టం. మితంగా తింటే మంచిది. ఉత్తరేణి ఆకులు - దంతవ్యాధులు నయమగును. ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి. తులసీ ఆకులు - దగ్గు, వాంతులు, సర్వ రోగనివారిణి. రోజు ఐదు, ఆరు ఆకులను తింటే మంచిది. మామిడి ఆకు - కాళ్ళ పగుళ్ళు, అతిసారం నయమగును. మామిడి జిగురులో ఉప్పు కలిపి వేడి చేసి పగుళ్ళకు రాయాలి. గన్నేరు ఆకు - జ్వరమును తగ్గించును[లోనికి తీసుకోరాదు] అవిసె ఆకు - రక్త దోషాలు తొలగును. ఆకు కూరగా వాడవచ్చు. అర్జున పత్రం -మద్ది ఆకులు - వ్రణాలు తగ్గును. వ్రణాలున్న భాగాల్లో ఆకులను నూరి రాసుకోవాలి. దేవదారు ఆకులు - శ్వాశకోశ వ్యాధులు తగ్గును మరువం ఆకులు - శరీర దుర్వాసన పోగొట్టును. వేడినీటిలో వేసుకొని స్నానం చేయవలెను. వావిలి ఆకు - ఒంటినొప్పులను తగ్గించును. నీటిలో ఉడికించి స్నానం చేస్తె మంచిది. గండకీ ఆకు - వాత రోగములు నయమగును జమ్మి ఆకులు - కుష్ఠు వ్యాధులు తొలగును. ఆకుల పసరును ఆయా శరీర భాగాలలో రాసుకోవాలి. జాజి ఆకులు - నోటి దుర్వాసన పోగొట్టును. ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి. రావి ఆకులు - శ్వాసకోశ వ్యాధులు తగ్గును. పొడి చేసి తేనెతో సేవిస్తే మంచిది. దానిమ్మ ఆకు - అజీర్తి, ఉబ్బసం తగ్గును. పొడిచేసి కషాయంగా తాగవచ్చు. జిల్లేడు ఆకులు - వర్చస్సు పెంచును.
Comentarios