ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు - Six important vitamins for growing children
- Dr. Vandana Seshagirirao
- Jan 31, 2016
- 1 min read

ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు విటమిన్ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం
చీజ్,
క్యారెట్,
పాలూ,
గుడ్లూ
వాళ్లకి అందించాలి. బి విటమిన్లూ: మొత్తం శరీర పనితీరు బాగుండి చురుగ్గా ఉండాలంటే అన్ని రకాల బి విటమిన్లూ అందేట్టు చూడాలి.
మాంసం,
చేపలూ,
సోయా,
బీన్స్
వంటివి ఇవ్వడం వల్ల బి విటమిన్లు అందుతాయి. కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్ సి చాలా అవసరం.
టొమాటోలూ,
తాజా కాయగూరలూ,
విటమిన్ సి అందించే పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్ సి లభిస్తుంది.
ఎముక బలానికి: ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్ డి అందాలి. ఇందుకోసం
పాలూ,
పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి.
ఇనుము లోపం లేకుండా: ఇది రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం
పాలకూర,
ఎండుద్రాక్ష,
బీన్స్ వంటివి తరచూ తీసుకోవాలి.
Comments